Naalo Nenu歌词
作词 : Ramajogaiah Sastry
作曲 : Mickey J. Meyer
నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా
నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా
ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను
ఎంత ఎంత ముద్దొస్తున్నావో
ఎంత ఎంత అల్లేస్తున్నావో
నువ్విలా
నాలో నుంచి నన్నే మొత్తంగా తీసేసావు
·· సంగీతం ··
చల్లగాలి చక్కలిగింతల్లో నువ్వే
చందమామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే
రంగు రంగు కుంచెల గీతంలో నువ్వే
రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే
అటు ఇటు ఎక్కడో నువ్వెటు నిలిచినా
మనసుకు పక్కనే నిన్నిలా చూడనా
నీదే ధ్యాసలో నను నేను మరిచిన
సంతోషంగా సర్లే అనుకోనా ఎన్నాళ్ళైనా
·· సంగీతం ··
కలలకిన్ని రంగులు పూసింది నువ్వే
వయసుకిన్ని మెలికలు నేర్పిందీ నువ్వే నువ్వే
నిన్న లేని సందడి తెచ్చింది నువ్వే
నన్ను నాకు కొత్తగ చూపింది నువ్వే నువ్వే
మనసుకు నీ కల అలవాటై ఇలా
వదలదే ఓ క్షణం ఊపిరే తీయ్యగా
నా నలువైపులా తియ్యని పిలుపులా
మైమరిపించే మెరుపుల సంగీతం నీ నవ్వేగా