Aaraduguluntada 歌词
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే
బెరుగ్గా బెరుగ్గా ఐపోకే
బదులేది ఇవ్వకుండ వెళ్ళిపోకే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా
~ సంగీతం ~
మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టెయ్యడా
కబురుల చినుకులతో పొడికలలన్నీ తడిపెయ్యడా
ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదెయ్యడా
పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా
మౌనమై వాడు ఉంటే ప్రాణమేమవ్వునో
నువ్వే నా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ
నువ్వే నా సమస్తం అంటాడే
కలలోన కూడ కానుకందనీడే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికి నచ్చేసే వాడా
~ సంగీతం ~
అడిగిన సమయంలో తను అలవోకగ నను మోయాలి
సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి
పనులను పంచుకొనే మనసుంటే ఇంకేం కావాలి
అలకని తెలుసుకొని అందంగా బతిమాలాలి
కోరికేదైన గానీ తీర్చి తీరాలనీ
అతన్నే అతన్నే అతన్నే చూడడానికి
వయస్సే తపిస్తూ ఉంటుందే
అపుడింక వాడు నన్ను చేరుతాడే